శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి NH 65 ప్రధాన రహదారిపై BHEL చౌరస్తాలో రూ. 170 కోట్ల అంచనావ్యయంతో చేపడుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనులను, సర్వీస్ రోడ్డు విస్తరణ, వరద నీటి కాల్వల నిర్మాణం పనులను, మంజీర మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులను కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఫ్లై ఓవర్ ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణము పనులను వేగవంతం చేయాలని, వరద నీరు కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ ,మాజీ కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ గౌడ్, రఘునాథ్ రెడ్డి ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ,జనార్దన్ రెడ్డి,నాగరాజు, ఓ వెంకటేష్ అక్బర్ ఖాన్, పోషయ్య,భవాని, అనిల్, నరేందర్ బల్లా,యూసఫ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.