నమస్తే శేరిలింగంపల్లి: రైతులకు న్యాయం చేయాలంటూ సీపీఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి మండల తహశీల్దారు కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు సాకులు చెబుతూ రైతులను మోసం చేయాలని చూస్తున్నాయని అన్నారు. రైతులు పండించిన పంటలను కొంటామని ప్రభుత్వాలు రైతులకు హామీలిచ్చి గద్దెనెక్కిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ఇబ్బందుల పాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పండించిన ధాన్యాన్ని తక్షణమే గిట్టుబాటు ధరలకు కొనాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల కార్యాలయం సూపర్ డెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ శేరిలింగంపల్లి కార్యదర్శి టి. రామకృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు కె. నరసింహా రెడ్డి, చంద్ యాదవ్, కే కాసిం, డి. రవి, డి. రవీందర్, మహిళా సమైక్య సభ్యులు లక్ష్మీ, బిపాషా, తదితరులు పాల్గొన్నారు.
