నమస్తే శేరిలింగంపల్లి: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నహస్తంలా అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆస్పత్రిలో వైద్య చికిత్సల కోసం అయిన ఖర్చుల ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్ని మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ కు చెందిన ముంతాజ్‌బేగంకు రూ. 44 వేల చెక్కును ప్రభుత్వ విప్ గాంధీ బుధవారం అందజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఆపదలో ఉండి వైద్య ఖర్చులు చేసుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఆరెకపూడి గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.