నమస్తే శేరిలింగంపల్లి: వరి వేస్తే ఉరి అని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతుల పక్షాన పోరాడేందుకు గురువారం బిజెపి తలపెట్టిన రైతుదీక్షలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి బిజెవైఎం రాష్ట్ర నాయకులు నీరటి చంద్రమోహన్ పాల్గొన్నారు. బిజెపి రైతుల పక్షాన పోరాటం చేస్తుందని, వరి ధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా చంద్రమోహన్ డిమాండ్ చేశారు. వరి సాగు చేయకుంటే కోట్ల నిధులు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకని ప్రశ్నించారు. వరి సాగు చేయొద్దంటూ రైతులను భయాందోళనకు గురి చేయడం సరికాదన్నారు.