నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పండగను పురస్కరించుకుని భేరీ ఫిలిం కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సంక్రాంతి పండగ పాటను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భేరీ ఫిలిం కార్పొరేషన్ మంచి సందేశాత్మకమైన లఘుచిత్రాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి పాట రూపొందించడం సంతోషకరమని అన్నారు. మున్ముందు ఇంకా మంచి సందేశాత్మక చిత్రాలు మంచి మంచి పాటలు తీయాలని ఆకాంక్షించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ సంక్రాంతి పాటను అందరూ చూసి ఆదరించి యూట్యూబ్ ఛానల్ ద్వారా సపోర్ట్ చేయాలన్నారు. భేరీ ఫిలిం కార్పొరేషన్ సంస్థ ద్వారా మున్ముందు సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాత్మకమైన చిత్రాలు రూపొందించడమే తమ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో అరుణ శ్రీ తుమ్మల వెంకట్రాంరెడ్డి, దర్శకులు పెద్ద రాజుల మధు, కొరియోగ్రాఫర్ శ్రీశైలం యాదవ్, ఎడిటర్ బీరప్ప, రంజిత్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ తలారి పవన్, మహేష్ గౌడ్, లైటింగ్ స్పాన్సర్ నిర్మల్ గౌడ్, ప్రొడక్షన్ మేనేజర్ మాదారం చంద్రయ్య, కడుమూర్ శ్రీను, మైత్రి, సంక్రాతి పాట నటీనటులు పాల్గొన్నారు.