నమస్తే శేరిలింగంపల్లి: మెడికల్ షాప్ లో మందులు కొనడానికి వెళ్తున్నా అంటూ ఇంట్లో నుంచి బయల్దేరి వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగండ్ల అపర్ణ జెనిత్ లేబర్ కాలనీలో పనిచేస్తున్న మహేంద్ర కుమార్ బెహరాకు 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భార్య కడం బారి బెహరా తన ఇద్దరి పిల్లలతో కలిసి సొంత గ్రామం బాట కొమరాడ ఒడిస్సా లో ఉండేవారు. గత రెండు నెలల క్రితం తన భార్యను పనిచేసే చోటికి తీసుకువచ్చాడు. కడం బారి బెహరా కూలీపని, ఇండ్లలో పని చేస్తూ జీవిస్తున్నారు. ఈ నెల 11 వ తేదీన మెడికల్ షాప్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిన భార్య కడం బారి బెహరా తిరిగి రాలేదు. చుట్టు పక్కలా ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త మహేంద్ర కుమార్ బెహరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తన భార్య పనిచేసే చోటనే కూలీ పని చేసే అభినందన్ బర్మన్ అనే వ్యక్తితో వెళ్లినట్టు భర్త మహేంద్ర కుమార్ బెహరా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. సమాచారం తెలిసిన వారు చందానగర్ పిఎస్ కు, 100 కు గాని, 040 27853911, 9490617118, 7901110877 నంబర్లకు సమాచారం ఇవ్వగలరని పోలీసులు తెలిపారు.