బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించాలి

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీసులు, మండల ఆఫీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులను ఆ సంఘాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దిగ్బంధము చేసి మెమొరాండం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వ‌ర్యంలో శేరిలింగంపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో బీసీ నాయకులు, బీసీ ఫెడరేషన్, శేరిలింగంపల్లి బిసి సంక్షేమ సంఘం, మియాపూర్ బీసీ సంఘం కలిసి మెమరాండం అంద‌జేశారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42 శాతం ప్ర‌క‌టించిన మేర‌కు బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పడమే కాకుండా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింద‌ని, క‌నుక తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల‌కు రాబోయే స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంపల్లి బిసి ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి తిరుపతి, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి బి కృష్ణ , మియాపూర్ అధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్, కార్యదర్శి నరసింహ యాదవ్, శేరిలింగంపల్లి మహిళా అధ్యక్షురాలు వెంకటమ్మ, యువజన సంఘం అధ్యక్షుడు, కే నరసింహ యాదవ్, నెహ్రూ, ఈశ్వర్ గౌడ్, హరికృష్ణ చారి, బీసీ సంఘాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

శేరిలింగంప‌ల్లి మండ‌ల రెవెన్యూ కార్యాల‌యంలో మెమొరాండం అంద‌జేస్తున్న భేరి రామ‌చంద్ర యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here