ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల‌ను సేకరిస్తున్న బిజెవైఎం, బిజెపి నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని బిజెపి శేరిలింగంపల్లి ఇంచార్జీ గజ్జల యోగానంద్, రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలంటూ రంగారెడ్డి అర్బన్ జిల్లా,శేరిలింగంపల్లి అసెంబ్లీ, చందానగర్ డివిజన్ బిజెవైఎం ఆధ్వర్యంలో తారానగర్ మార్కెట్ రోడ్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల‌ను సేకరిస్తున్న బిజెవైఎం, బిజెపి నాయకులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం రాగానే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే లక్షా ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన మాటను విస్మరించి కాలయాపన చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ తేల్చిందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే వరకు నిరుద్యోగుల తరుపున బిజెపి,బిజెవైఎం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, బిజెపి డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి, బిజెపి డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ సింధు రెడ్డి, ఎల్లేష్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెవైఎం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, రాష్ట్ర మాజీ కార్యదర్శి నిరటి చంద్రమోహన్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, బిజెవైఎం చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్ భారత్, జిల్లా కార్యవర్గసభ్యులు ఆకుల సందీప్, నాయకులు మధు, బిజెవైఎం చందానగర్ డివిజన్ అధ్యక్షులు పిరంగి మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాయి మురళి, నాయకులు మనోజ్, శ్రవణ్ పాండే, లింగం సురేష్, కిరణ్, వినోద్ చౌదరి, మణి, సాయి శివ, కౌశిక్, సాయి, పవన్, ప్రశాంత్ నాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here