నమస్తే శేరిలింగంపల్లి: కాయిదమ్మ కుంట చెరువు కట్ట కింద గల కల్వర్టు సమస్యను త్వరలోనే పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేస్ 1 కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ విప్ గాంధీ పర్యటించారు. జనప్రియ ఫేస్ 1 కాలనీలో రోడ్డు ను పునరుద్ధరణ చేసినందుకు కాలనీ వాసులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. కాయిదమ్మ కుంట చెరువు కట్ట కింద గల కల్వర్టు సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ను స్థానికులు కోరగా తప్పకుండా శాశ్వత సమస్యకు పరిష్కారం చూపుతామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ కాలనీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. కాయిదమ్మ చెరువు అలుగు నుండి నిర్మించిన వరద నీటి కాలువ నిర్మాణం పూర్తి చేస్తామని, కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను , సమస్యలను పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ ప్రతాప్, వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ రజియా బేగం, జనప్రియ ఫేస్ 1 కాలనీ వాసులు శాంతయ్య, మలికార్జున్, ఉమేష్, ఉమామహేశ్వరరావు, రవి, రాంచందర్, సురేష్, ఫణి కుమార్, ప్రకాష్ పటేల్, శ్రీనివాస్, వాసుదేవ్, రాంబాబు, ప్రభ, లీల రాణి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
