ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్నందుకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ‌ దగ్ధం

నమస్తే శేరిలింగంపల్లి: హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో బిజెపి ఆభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని స్థానిక టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకులు కొరదాల నరేష్ పేర్కొన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ చందానగర్ గాంధీ విగ్రహం వద్ద బిజెపి, బిజెవైఎం నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. హుజురాబాద్, ఇళ్ళంద కుంట మండలం సిరిసేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని స్థానిక టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని బీజేపీ నాయకులు వాపోయారు. ఘటన పట్ల తీవ్రంగా ఖండిస్తున్న బిజెవైఎం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ఓటమి భయంతోనే గుండాల్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, బిజెపి సీనియర్ నాయకులు హరికృష్ణ, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, బిజెపి డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి , బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాకేష్ దుభే , గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు నిరటి చంద్ర మోహన్ ,బిజెవైఎం నాయకులు శివ గౌడ్, బిజెవైఎం జిల్లా కార్యదర్శి సాయి, బిజెవైఎం జిల్లా కార్యాలయ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, బిజెవైఎం డివిజన్ అధ్యక్షులు శివ కుమార్, నవీన్ రెడ్డి, నందు, బిజెవైఎం నాయకులు సాయి మురళి, సామ్రాట్ గౌడ్, మున్నూర్ సాయి కుమార్, రాఘవేంద్ర, వినోద్, శివాజీ, కిరణ్, శ్రీను, వెంకట్, మన్యం, పాండు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here