నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ డివిజన్, బస్తీ కమిటీలతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గచ్చిబౌలి డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ కమిటీలను ఏర్పాటు చేసుకోనున్నట్లు చెప్పారు. సమావేశంలో డివిజన్ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.