నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్, జయనగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ సందర్శన అనంతరం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ ఇంటింటా ప్రచారం కొనసాగించారు.
ఈ సందర్భంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందని, ఎమ్మెల్యే గాంధీ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నామని తెలిపారు.
కారు గుర్తుకు ఓటు వేయాలని చెబుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ మేనిఫెస్టో పత్రాలను పంచుతూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.