హైదర్ నగర్ పరిధిలోని శుభోదయ కాలనీ లో రూ 22. లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డివిజన్ లో పెద్ద సంఖ్యలో సిసి రోడ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. కొన్నిచోట్ల విడి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తున్నానని, మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణం తో ప్రజలకు, వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా మారాయన్నారు. సిసి రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారులకు సూచించారు. రోడ్లు వేసేటప్పుడు కాలనీ వాసులకు, వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జి హెచ్ ఎం సీ
ఏ ఈ రాజీవ్, వర్క్ ఇన్ స్పెక్టర్ మహాదేవ్, ఏరియా కమిటీ మెంబర్ శేషయ్య, , టి ఆర్ ఎస్ నాయకులు మురళీధర్ రావు, రంగనాథరాజు, తదితరులు పాల్గొన్నారు.