నమస్తే శేరిలింగంపల్లి: నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, రాష్ట్ర ఎస్సీ మహిళా అధ్యక్షురాలు ఈ. విద్యారాణి 2021అభిష్టి సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యారాణి మాట్లాడుతూ అభిష్టి సేవా పురస్కారానికి ఎంపికవడం సంతోషకరంగా ఉందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. అవార్డు రావడానికి కృషి చేసిన జాతీయ సంస్థ నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షుడు నెల్లి గురుదేవ్, జాతీయ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి అనపర్తి సైదా సుదర్శన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ తెలంగాణ రాష్ట్ర నాయకులు, టీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.