నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో భూగర్బడ్రైనేజి ఓవర్ ఫ్లో సమస్యను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గోపనపల్లి వాసులతో కలిసి పరిశీలించారు. కొన్ని రోజులుగా భూగర్భ డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహించడంతో స్థానికులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా.. వెంటనే అక్కడి సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
డ్రైనేజీ శాశ్వత పరిష్కారం కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో కురుస్తున్న వర్షానికి కాలనీలలో రోడ్లు జలమయం అవుతున్నాయని వరద నీటిని వెంటనే కాలువల్లోకి మళ్లించాలని, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ డిజిఎం నారాయణ, మేనేజర్ అభిషేక్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు దయాకర్, సీనియర్ నాయకులు, రంగస్వామి, ముర్గా, సురేష్, టీంకు, మధు, స్థానిక నేతలు కార్యకర్తలు హెచ్ఎండబ్ల్యుఎస్ సూపర్ వైజర్ సురేష్ పాల్గొన్నారు.