నమస్తే శేరిలింగంపల్లి: సీబీఐ అధికారులమని చెప్పి సోదాలు చేయాలంటూ ఓ ఇంట్లోకి చొరబడి లూఠీ చేసిన ఘటన గచ్చిబౌలి నానక్ రాం గూడలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్ రాంగూడ జయభేరి ఆరెంజ్ కౌంటీ లో ప్లాట్ నం 110 లో నివసిస్తున్న భాగ్యలక్ష్మి, సుబ్రహ్మణ్యం ఇంట్లోకి సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు సీబీఐ అధికారులమని చెప్పి చొరబడ్డారు. భాగ్యలక్ష్మీతో మాటమాట కలిపి పరిచయం చేసుకున్నారు. ఇల్లును సోదాచేయాలని ఇళ్లంత గాలించారు. 20 నిమిషాల పాటు ఇంట్లో ఉండి భాగ్యలక్ష్మి వద్ద నుంచి లాకర్ కీస్ తీసుకుని కేజీ 35 తులాలు బంగారం, లక్ష 70 వేల నగదు ఎత్తుకెళ్లారు. అప్పడివరకు భయాందోళనలో ఉన్న భాగ్యలక్ష్మీ ఇంట్లో నుంచి సొమ్ములు, నగదును ఎత్తుకెళ్లారని గుర్తించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దుండగులు వాడిన కారు నంబర్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.