- జిహెచ్ఎంసీ అధికారులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి: అద్వాన్నంగా ఉన్న రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ వాసులు కార్పొరేటర్ హమీద్ పటేల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కార్పొరేటర్ హమీద్ పటేల్ అపార్ట్ మెంట్ వాసులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కుకు రోడ్లు వెయ్యడానికి కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని, తక్షణమే స్పందించి రోడ్లు వేయించాలని ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ ని కోరగా… ఆయన స్పందించి తక్షణమే రోడ్ల పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి రోడ్ల పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించారు. ఏఈ జగదీశ్, వర్క్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ, ఫ్రెష్ లివింగ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రసాద్, రఘురామ్ రెడ్డి, తిరుమల రెడ్డి, శ్రీహరి, శ్రీకాంత్, పరేష్ షా, సుధాకర్ రావు ఉన్నారు.