చందానగర్‌లో బిజెపి కాగాడాల ప్రదర్శన
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆద్వర్యంలో మంగళవారం సాయంత్రం చందానగర్ గాంధీ విగ్రహం వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నరెందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని కాడగాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే మాటమార్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను చిత్ర హింసలకు గురిచేసిన నిజాంను పొగిడే కేసీఆర్, ఆ వారసులకు అమ్ముడుపోయి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు జంకుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దిగొచ్చి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని, లేనియెడల ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ జితెందర్ ఆద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మోర్చా రాష్ట్ర నాయకులు అరుణ్‌కుమార్, నీరటి చంద్రమోహన్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జిల్లా నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్, వసంత్‌కుమార్ యాదవ్, మహిపాల్‌రెడ్డి, కలివేముల మనోహర్, డివిజన్ల అధ్యక్షులు నీలం జయరాం, మాణిక్‌రావు, శ్రీధర్, స్థానిక నాయకులు శివకుమార్ గౌడ్, శివ, తదితరులు పాల్గొన్నారు.
Nice
తెలంగాణ ఉద్యమం సమయం లో చెప్పిన ఏ పని ప్రస్తుత ప్రభుత్వం చేయకపోవడం విచారకరం…. ఒక వర్గానికి చెందిన వారికి తుత్తులుగా వ్యవహరిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం మారాలి…
Good information,for those who don’t know the values of green leaves pls read it fully for your knowledge..
Thank you
NSLP
ధన్యవాదాలు
మంచివారికి భగవంతుడు ఎప్పుడూ తోడు ఉంటారు,మీ ట్రైయిల్ న్యూస్ సెక్సస్ God bless you. మంచిరోజు చూసి ప్రొసీడ్ అవ్వండి All the best
ధన్యవాదాలు మిత్రమా