రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి

  • ఏఈ శివరాం కు ఎంసిపి(యు) ఆధ్వర్యంలో వినతి

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ ఎం.ఎ నగర్ లో అర్ధంతరంగా ఆపేసిన రోడ్ నెంబర్ 7సి, 5బి రోడ్లు వల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని ఎంసిపి(యు)మియాపూర్ 108 డివిజన్ కమిటి సభ్యురాలు జి. శివాని అన్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం జరుగుతున్నదని ఎం సి పి ఐ (యు) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ఎఇ శివరాంని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏఇ శివరాం సానుకూలంగా స్పందించి తక్షణమే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

వినతి పత్రం సమర్పిస్తున్న దృశ్యం

ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యురాలు జి. శివాని, బస్తీ వాసులు లక్ష్మి, సావిత్రి, అనసూయ, నిర్మలమ్మ, వెంకటేష్, బి. లక్ష్మి, మేరీ, బుబమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here