శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయిరాం నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కాలనీ వాసులు మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని వినతిపత్రం ద్వారా కోరారు. కాలనీ వాసుల విజ్ఞప్తిపై ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే శ్రీ సాయిరాం నగర్ కాలనీలో స్వయంగా పర్యటించి, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని, విడతలవారీగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. వివిధ కాలనీల ప్రజల నుంచి అందుతున్న వినతులు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు.

PAC చైర్మన్ అరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో మియాపూర్ డివిజన్లో అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలు, నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కారానికి కృషి చేస్తానని, శ్రీ సాయిరాం నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరగాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచిస్తామని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజల మెరుగైన జీవన ప్రమాణాల కోసం అవసరమైన అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ఉమ్మడి మియాపూర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దుతామని ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సాయిరాం నగర్ కాలనీ వాసులు మహమ్మద్ షా, సత్యనారాయణ, మల్లికార్జున్ రెడ్డి, రవీందర్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శామీర్, నరేందర్ రెడ్డి, రామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.





