శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్-48 పరిధిలోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 3 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. విభాగాల వారీగా అందిన ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఒకటి, రెవెన్యూ విభాగానికి ఒకటి, ఇంజనీరింగ్ విభాగానికి ఒక ఫిర్యాదు చొప్పున అందాయి. మిగిలిన అన్ని విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత విభాగాల అధికారులకు పంపించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.






