శేరిలింగంపల్లి, నవంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సైనేత్ర ఫౌండేషన్ (దృష్టి లోపం ఉన్నవారి ఆశ్రయ కేంద్రం) ఆధ్వర్యంలో 2027 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు షిర్డీ యాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్రలో 30 మంది దృష్టి లోపం ఉన్నవారు, 16 మంది వాలంటీర్లు, వారి పిల్లలు పాల్గొననున్నారు. ఈ యాత్రకు సుమారు రూ.45వేలు ఖర్చు అవుతుందని, ఒక్కొక్కరికి సుమారు రూ.1వేయి వ్యయం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. దృష్టి లోపం ఉన్నవారికి షిర్డీ సాయినాథుని దర్శన భాగ్యం కల్పించి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సేవా కార్యక్రమానికి దాతలు, శ్రేయోభిలాషులు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించాలని సైనేత్ర ఫౌండేషన్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. విరాళాలు పంపించాల్సిన బ్యాంకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖాతా పేరు: Sainethra Foundation, బ్యాంకు: Karur Vysya Bank, ఖాతా సంఖ్య: 1482155000031783, ఖాతా రకం: Savings, బ్రాంచ్: Chandanagar, IFSC: KVBL0001482. మరిన్ని వివరాలకు K. B. Vishnu Murthy: 9440049015, Anitha: 9348668999 లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.





