ఎం.ఏ. నగర్ కాలనీలో బీఆర్‌ఎస్ నాయకుడు రామప్రభు పర్యటన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఎం.ఏ. నగర్ కాలనీలో బీఆర్‌ఎస్ నాయకుడు రామప్రభు పర్యటించి, స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు, స్థానిక ప్రజలు, యువతతో సమావేశమై కాలనీలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కాలనీ అభివృద్ధికి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, శేఖర్, రవీందర్, భీంరాజ్, సుమో రాజు, శ్రీశైలం, శ్రీను, అనిల్, అల్లావుద్దీన్, నరసింహ, శరత్, సంతోష్, వెంకటేష్, వేణుగోపాల్, గణేష్, మూర్తి, దశరథ్, రాములు, జగన్, మోహన్, మహేష్, శివ, చంద్రయ్య, లక్ష్మీతో పాటు ఏఆర్‌పీ టీమ్ సభ్యులు, కాలనీ పెద్దలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here