శేరిలింగంపల్లి, అక్టోబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారులకు ప్రత్యేక న్యాయం చేయాలని, వారికి నెలకు రూ.5 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేస్తూ బహిరంగ సభ నిర్వహించారు. స్వర్ణకారుల సంక్షేమం, వారి హక్కుల సాధన ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ సభకు పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఈ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వర్ణకారులు, స్వర్ణకార సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 10 వేల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి పరిధిలోని తారానగర్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ప్రభు చారి, రఘు చారి, శ్రీధర్ చారి, హరికృష్ణ చారితో పాటు పలువురు స్వర్ణకారులు పాల్గొన్నారు. స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అర్హులైన స్వర్ణకారులకు నెలకు రూ.5 వేల పింఛన్ అందించేలా కృషి చేయాలని వారు కోరారు.





