రంగారెడ్డి అర్బన్ జిల్లా BJYM కార్యదర్శిగా ఎర్రగుడ్ల శివ యాదవ్ నియామకం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి అర్బన్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) కార్యదర్శిగా మాదాపూర్ డివిజన్‌కు చెందిన ఎర్రగుడ్ల శివ యాదవ్ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శివ యాదవ్ తెలిపారు. తనకు ఈ పదవి కేటాయించేందుకు కృషి చేసిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, BJYM జిల్లా అధ్యక్షుడు సాయిరాం గౌడ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here