పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఎన్నికల సన్నద్ధత, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల నిర్వహణలో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం, సమిష్టి కృషి కీలకమని వివరించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఏఐసీసీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పరజాత నరసింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బండి రమేష్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, చల్లా నరసింహారెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మండల, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.

మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ నాయకులు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని సమావేశంలో ప్రాధాన్యతనిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here