సామ రామ్ మోహన్ రెడ్డి విజయానికి కృషి చేస్తాం: షేక్ హమీద్ పటేల్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ తెలిపారు. శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గాలు, డివిజన్ల ఇన్‌చార్జులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామ రామ్ మోహన్ రెడ్డి విజయానికి కాంగ్రెస్ శ్రేణులన్నీ సమష్టిగా పనిచేయాలని సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు. పట్టభద్రులను వ్యక్తిగతంగా కలిసి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు కూడగట్టాలని, ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించే దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో షేక్ హమీద్ పటేల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here