కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ ఖాయం: చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ ఉద్యమకారుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గ రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరంపై చర్చించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని చిర్రా రవీందర్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని కొనసాగిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ ఖాయమని చిర్రా రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కేటీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేస్తామని చిర్రా రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here