శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజధాని రణభేరి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత అధ్యక్షతన అక్టోబర్ 23న మధ్యాహ్నం 2 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఇన్‌చార్జులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. సభకు ముందు మియాపూర్ ఆల్విన్ సర్కిల్ నుంచి నరేన్ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీంఎంసీ ఇన్‌చార్జి, శేరిలింగంపల్లి ఇన్‌చార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.






