ఐక్యమత్యానికి ప్రతీకగా అలయ్ బలయ్ కార్యక్రమం: భేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దసరా పండుగను పురస్కరించుకుని పి. చంద్రమౌళి యాదవ్ ఆధ్వర్యంలో ఈదుల నాగులపల్లిలోని శంకర్ దుర్గ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు పి. చంద్రమౌళి యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రముఖులు, నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని, ఐకమత్యమే మహాబలమని అన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమం అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే మంచి వేదిక అని పేర్కొన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాములేటి యాదవ్, బోయిని మహేష్ యాదవ్, కృష్ణ యాదవ్, మల్లేష్ యాదవ్, రాఘవేందర్ బన్నీ యాదవ్, నాగపూర్ మహేష్ యాదవ్, నాగార్జున యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here