సామ రామ్ మోహన్ రెడ్డి విజయానికి సమిష్టిగా కృషి చేస్తాం: ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కృషి చేస్తామని మియాపూర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌ తెలిపారు. శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉప్పలపాటి శ్రీకాంత్‌ పాల్గొన్నారు. ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, మాజీ కార్పొరేటర్లు, మియాపూర్‌ డివిజన్‌ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలను తెలుసుకుంటూ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు నవంబర్‌ 6వ తేదీ వరకు ఉన్న నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకునేలా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీల వారీగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదు ప్రక్రియపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.

ఆన్‌లైన్‌ ద్వారా ఓటరు నమోదుకు అవసరమైన సమాచారాన్ని అందించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఉప్పలపాటి శ్రీకాంత్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here