బతుకమ్మ పండుగ సందర్భంగా 50 పేద కుటుంబాలకు చీరలు, దుస్తుల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను పురస్కరించుకుని ఆయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ (ASYF) ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి. రోహిత్ ముదిరాజ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 కుటుంబాలకు చీరలు, దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి. రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ, అవసరమైన వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ASYF సభ్యులు భాను ముదిరాజ్, స్వరూప్, శ్రీనివాస్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here