శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల హుడా కాలనీలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా శనివారం హుడా కాలనీలో మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు పాల్గొని సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళా సంఘం నాయకురాళ్లు సరిత, హరిణి, విజయ, సరస్వతి, సమత, విజయలక్ష్మి, సరోజని, కరుణ, అనూష, సునీత తదితరులు పాల్గొన్నారు.






