మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి.. 10 ఫిర్యాదుల స్వీకరణ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 10 ఫిర్యాదులు అందాయి. వీటిలో టౌన్ ప్లానింగ్‌కు సంబంధించి 4, ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 4, యూబీడీ (UBD) విభాగానికి సంబంధించి 2 ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here