అట్టహాసంగా శుభోదయ కాలనీ వినాయకుడి నిమజ్జన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీం ఈవైఎ సభ్యులు, కాలనీ వాసి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. నిమజ్జన ఊరేగింపులో డప్పు వాయిద్యాల మోత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పుల హోరుకు అనుగుణంగా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పెద్దలు సైతం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయక నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో కాలనీ వీధులు మార్మోగాయి.

నిమజ్జనానికి ముందు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం డప్పు వాయిద్యాలు, భక్తుల నినాదాల మధ్య వినాయకుడి నిమజ్జన ఊరేగింపు వైభవంగా కొనసాగింది. మహిళలు, చిన్నారుల ఉత్సాహం, కాలనీవాసుల భాగస్వామ్యంతో వేడుకలు కన్నులపండువగా సాగాయి. టీం ఈవైఎ సభ్యుల సహకారంతో రామకృష్ణ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీవాసుల సమష్టి భాగస్వామ్యంతో భక్తి, సాంస్కృతిక సందడి కలగలిసిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. చివరగా గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రావాలి అంటూ భక్తులు గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here