హుడా కాలనీలో ఘనంగా గణేష్‌ నిమజ్జనోత్సవం.. పాల్గొన్న హైపర్ ఆది, రోజా భారతి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో స్వామి వివేకానంద యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్లబ్ వ్యవస్థాపకుడు నందనం విష్ణు దత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది, సినీనటి డాక్టర్ రోజా భారతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో గణేష్‌ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత ఉత్సాహంగా పాల్గొనడంతో హుడా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here