శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): నగరవాసులకు సరికొత్త వినోద అనుభవాన్ని అందించేందుకు కూకట్‌పల్లిలోని నెక్సస్ హైదరాబాద్ మాల్ సిద్ధమవుతోంది. ఈ పండుగ సీజన్లో పిల్లలు, కుటుంబాలను ఆకట్టుకునేలా పాండా వరల్డ్ పేరుతో ఇమ్మర్సివ్ కార్నివాల్‌ను నిర్వహించనుంది. అక్టోబర్ 4 నుంచి మాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది. పాండా థీమ్‌తో మాల్‌ను ప్రత్యేకంగా అలంకరించనున్నారు. బాంబూ ట్రైల్స్, పగోడా తరహా సెటప్‌లు, భారీ పాండా ఇన్స్టాలేషన్లు, ఇంటరాక్టివ్ స్టోరీటెల్లింగ్ జోన్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. సాధారణ షాపింగ్ అనుభవానికి భిన్నంగా వినోదం, గేమ్స్, లైవ్ పెర్ఫార్మెన్స్‌లతో కార్నివాల్ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భారీ పాండా రైడ్స్, కైనెటిక్ సీసాలు, బాంబూ ఆర్ట్ ఇన్స్టాలేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆర్కేడ్ గేమ్స్, క్లా మెషీన్లు, స్కిల్ గేమ్స్‌తో ప్రత్యేక కార్నివాల్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్లష్ టాయ్స్ గెలుచుకునే అవకాశం కూడా సందర్శకులకు ఉండనుంది. అదేవిధంగా AR ఫొటో బూత్‌లు, 3D వర్చువల్ పాండాలతో ఫొటోలు తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పగోడా ఆర్చ్‌లు, లైట్ టన్నెల్స్, థీమ్ బ్యాక్‌డ్రాప్‌లతో ఫొటో జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సెంట్రల్ డ్యాన్స్ ఫ్లోర్, పెర్ఫార్మెన్స్ ఏరియాలో రోజువారీ లైవ్ యాక్ట్స్, డ్యాన్స్ సెషన్స్, కుటుంబాల కోసం ఇంటరాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పిల్లల కోసం DIY వర్క్‌షాప్‌లు, పెయింటింగ్, క్రాఫ్ట్ తయారీ వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పాండా వరల్డ్ ప్రవేశ టికెట్ల ధరలు రూ.399 నుంచి ప్రారంభం కానున్నాయి. మాల్లోని టికెట్ డెస్క్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ పాసులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని వయసుల వారికి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.






