శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన నర్సింహమూర్తికి అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.1.75 లక్షల విలువైన CMRF-LOC మంజూరు పత్రాన్ని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఆపన్నహస్తంగా నిలుస్తోందని గాంధీ అన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలు, అభాగ్యులకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వినోద్ రావు, మిరియాల ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.





