శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్-48, ఎస్ఎల్పీజడ్ పరిధిలోని గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో పారిశుధ్య ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. కొత్తకుంట చెరువు, పీజేఆర్ బేబీ పాండ్, గంగారం పాండ్ వద్ద డీవైఈఈ, ఎస్ఆర్పీ, ఎస్ఎఫ్ఏలతో కలిసి డీసీ శ్రీనివాస్ పారిశుధ్య తనిఖీలు నిర్వహించారు. నిమజ్జన ప్రాంతాల్లో డిప్లాయ్‌మెంట్ షెడ్యూల్ ప్రకారం చెత్తను సకాలంలో సేకరించేలా చర్యలు తీసుకోవాలని రామ్కీ సంస్థకు అధికారులు సూచించారు. అలాగే నిర్దేశిత చెత్త సేకరణ ప్రాంతాల్లో గార్బేజ్ బ్యాగ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.






