సీఎంసీ ప్రజావాణికి 43 వినతులు

శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 43 వినతులు అందాయి. తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రజలు నేరుగా కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. శాఖల వారీగా పరిశీలిస్తే.. టౌన్ ప్లానింగ్‌కు 28, ఇంజినీరింగ్‌కు 10, అర్బన్ బయోడైవర్సిటీకి 3, ఎంటమాలజీకి 1, శానిటేషన్‌కు 1 వినతులు అందాయి.

ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేకగ్రీవెన్స్ ఐడీ, ట్రాకింగ్ లింక్ కేటాయించారు. దీంతో ఫిర్యాదుదారులు తమ సమస్య పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించే విధానాన్ని సీఎంసీ అమలు చేస్తోంది. స్వీకరించిన వినతులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్పొరేషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమం వేదికగా నిలుస్తోందని అధికారులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here