మియాపూర్ స‌ర్కిల్ ప్ర‌జావాణికి 3 ఫిర్యాదులు

శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో సోమ‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా డీసీ జి.శ్రీ‌నివాస్ స్వ‌యంగా పాల్గొని ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదులు, విన‌తుల‌ను స్వీక‌రించారు. స‌ర్కిల్ టౌన్‌ప్లానింగ్ విభాగానికి 1 ఫిర్యాదు రాగా, ఇంజినీరింగ్‌కు 2 మొత్తం క‌లిపి 3 ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఆయా ఫిర్యాదుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు డీసీ శ్రీ‌నివాస్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here