శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): నిజాంపేట్ పరిధిలోని వాటర్ లాగింగ్ పాయింట్లు, రోడ్లపై గుంతలు (పాత్ హోల్స్), దెబ్బతిన్న రహదారులు, సమస్యాత్మక నాలా ప్రాంతాలను డిప్యూటీ కమిషనర్ సాబెర్, డీఈ, ఏఈ అధికారులతో కలిసి మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, పెండింగ్లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చారు. అలాగే సీఎంఆర్ షాపింగ్ మాల్ సమీపంలోని వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద ఉన్న మాన్హోల్ కవర్ను మార్చి, వర్షపు నీరు నిరంతరం వెళ్లేలా దానిని క్యాచ్ పిట్గా అభివృద్ధి చేశారు. వర్షాకాలంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తగ్గించే చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.






