శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): కంటి వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఎలైట్ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డా. సీతారాం ఫణి కుమార్ కు తెలంగాణ గ్లోబల్ ఎలైట్ బిజినెస్ అవార్డ్స్ 2026లో ప్రతిష్ఠాత్మక అవుట్‌స్టాండింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఐ హెల్త్‌కేర్ అవార్డు లభించింది. కంటి ఆరోగ్య సేవల విస్తరణ, నాణ్యమైన వైద్య సేవలు, వృత్తిపరమైన ప్రతిభ, సమాజానికి చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ప్రైమ్ టైకూన్ మీడియా అండ్ టెక్ ఎల్ఎల్పీ ఈ అవార్డును ప్రదానం చేసింది. దేశ నిర్మాణంలో విశిష్ట వృత్తిపరమైన కృషి చేసినందుకు ఈ గుర్తింపును అందజేసినట్లు అవార్డు ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో నాణ్యమైన సేవలను మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉంటామని, రోగులకు అత్యాధునిక కంటి వైద్య సేవలను అందించడమే తమ లక్ష్యమని డా. సీతారాం ఫణి కుమార్ పేర్కొన్నారు. ఈ అవార్డు తమ బృందం సమిష్టి కృషికి దక్కిన గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు.






