షూస్‌, క్లాత్స్ షోరూమ్‌ల‌ను ప్రారంభించిన మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ

శేరిలింగంప‌ల్లి, జూలై 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన Syed Mujeeb Shoes & Accessories, Mine Mine Kids Wear షోరూమ్‌లను తెలంగాణ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. బీఆర్‌ఎస్ యువ నాయకుడు సయ్యద్ ముజీబ్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ నూతన వ్యాపార సంస్థలను ప్రారంభించిన యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రముఖులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here