- హైందవ ధర్మ రక్షణే ధ్యేయంగా శంకర రథయాత్ర
శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మదీనాగడూ దీప్తిశ్రీనగర్ లో ఉన్న శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఆదివారం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వైభవ రథయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతిపూజ, గురుపూజ కార్యక్రమం, పూర్ణాహుతి నిర్వహణ, శ్రీలలితా సహస్రనామ పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

సాయంత్రం సౌందర్యలహరి పారాయణం, సభ, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల గురు పూజ విశేష ప్రవచనం నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. రాత్రి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వైభవ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మపురి క్షేత్రం వ్యవస్థాపకురాలు, భారతీయం కన్వీనర్ సత్యవాణి, చల్లా రాజేంద్ర ప్రసాద్, జై జై శంకర యజమాని ప్రసాద్ రావు, పండితులు సూర్యనారాయణ మూర్తి, కల్యాణ చక్రవర్తి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






