శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జనప్రియ నగర్ ఫేజ్-1లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీవాసులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, వర్షపు నీటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. కాలనీవాసులతో కలిసి ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన, కాలనీలోని ఓపెన్ జిమ్‌ను కూడా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. తమ సమస్యలను స్వయంగా వచ్చి తెలుసుకోవడం పట్ల కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ, స్పందించినందుకు బాలింగ్ గౌతమ్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.





