ఘ‌నంగా మారబోయిన రవి యాదవ్ జన్మదిన వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, మే 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జ్, పార్టీ సీనియర్ నాయకుడు మారబోయిన రవి యాదవ్ జన్మదిన వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ రవి యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ మారబోయిన రవి యాదవ్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి కీలక పదవులు చేపట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. యువత రాజకీయాల్లోకి ముందుకు వచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజన వర్గాలకు రాజ్యాధికార ఫలాలు అందేలా యువ నాయకత్వం కృషి చేయాలని సూచించారు. సమాజంలో యువత మంచి ఆలోచనలు, ప్రజాసేవా దృక్పథంతో రాజకీయాల్లో రాణించి పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, గోపీనగర్ బీసీ నాయకులు నరసింహ గౌడ్, వెంకటేష్ మేస్త్రి, సందీప్ యాదవ్, రాజు గౌడ్, మేదరి మహేంద్ర సంఘం వెంకట్, గోపాల్ యాదవ్, రాజు యాదవ్, కిరణ్ ముదిరాజ్‌తో పాటు శేరిలింగంపల్లి డివిజన్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మారబోయిన రవి యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here