శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళా రిజర్వేషన్ గురించి మహిళా లోకం దశాబ్దాల కాలం నుండి కోటి ఆశలతో ఎదురుచూస్తుంటే ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేకుండా వీగిపోయేలా చేసి మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయిందని శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారబోయిన రవికుమార్ యాదవ్ ఆరోపించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో వీగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైందని ఆరోపిస్తూ బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ GHMC కార్యాలయం నుండి ఇందిరాపార్క్ వరకు నిర్వహించిన మహిళా ఆక్రోష్ ర్యాలీలో రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన వెంట కొండాపూర్ మసీద్ బండ పార్టీ కార్యాలయం నుండి, శేరిలింగంపల్లి నియోజక వర్గం నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ ఆక్రోశాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో ప్రతి రాష్ట్రానికి 50 శాతం పెంచుతాం అని చెప్పినా బీజేపీ ఎక్కడ బలపడుతుందో అనే భయంతో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని అన్నారు. అదే బిల్లు పాస్ అయి ఉంటే చట్ట సభలలోనే కాకుండా అన్ని రంగాలలోనూ మహిళలు ముందడుగు వేసే వారని అన్నారు. ఇలాంటి చారిత్రాత్మకమైన గొప్ప బిల్లును ఆదుకున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయం అని రవి కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, సీనియర్ నాయకుడు వసంత్ యాదవ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, మాజీ డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి, విష్ణు దత్తు, వినయ , పద్మ , వరలక్ష్మి , కాంచన కృష్ణ , విజయలక్ష్మి, సరోజా రెడ్డి, భారతి, జ్యోతి, లక్ష్మి, నాగలక్ష్మి, సుజాత, కౌసల్య, దుర్గాబాయి, రేణుక, స్రవంతి, పుష్పవతి, కవిత , లలిత, చామంతి పాల్గొన్నారు.





