శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి బార్ కౌన్సిల్‌కు సంబంధించిన ఎన్నికలను తాజాగా నిర్వహించారు. న్యాయ వాదులు భారీ సంఖ్య లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కొత్త కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి పెద్ద గెలుపొందగా, ప్రధాన కార్యదర్శిగా కె. సురేందర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బి. సత్యనారాయణ, కె. శ్రీదేవి ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా శివ ప్రసాద్ గౌడ్, కోశాధికారిగా కె. గోపాల్ రెడ్డి, క్రీడా కార్యదర్శిగా ఎన్. రమేష్, సాంస్కృతిక కార్యదర్శిగా వి. శ్రీలత , మహిళా ప్రతినిధిగా చి. ప్రత్యూష, కార్యవర్గ సభ్యులుగా సోను మిత్తల్, ఎస్. ధనలక్ష్మి, శ్రీకాంత్ టి, నవీన్ కుమార్ ఎం, సందీప్ రెడ్డి ఎస్, కల్యాణి జి, వి. అరవింద్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. వారి పదవీకాలంలో బార్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.






