ఘ‌నంగా శివ లింగాష్టకం ఆడియో విడుద‌ల

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భక్తి, భావం, బాలప్రతిభల సమ్మేళనంగా మా లిటిల్ చాంప్స్ గ్రూప్ రూపొందించిన తొలి ఆధ్యాత్మిక సంగీత ప్రాజెక్ట్ శివ లింగాష్టకం ఆడియోను ఘనంగా విడుదల చేశారు. చిన్నారుల స్వరాలతో ఆవిష్కృతమైన ఈ భక్తిగీతం, శివభక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేలా రూపొందింది. ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ సమక్షంలో ఆయన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులను ఆశీర్వదిస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయత్నాలు బాలప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందిస్తాయని ప్రశంసించారు.

ఈ పవిత్ర భక్తిగీతాన్ని లిటిల్ చాంప్స్‌కు చెందిన వివిక్త, మైరా, రియాన్ష్, లూషా, కాత్యాయనీ, దివిషా, పునర్వి ఎంతో భక్తి, శ్రద్ధతో ఆలపించారు. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు నటరాజ్ గుప్తా, స్వరమహతి కళాపరిషత్ సభ్యులు పాల్గొన్నారు. శివ లింగాష్టకం ఆడియో ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ సంగీత వేదికలైన Spotify, JioSaavn, Apple Music, Amazon Music లలో శ్రోతలకు అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా స్వరమహతి సంగీతాలయ ప్రధానాచార్యులు డా. బండనపూడి ఆదిత్య కిరణ్ మాట్లాడుతూ తమ సంస్థకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here